: రామ్ చరణ్ కు వ్యతిరేకంగా పోలీసుల నివేదిక


సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై దాడి సంఘటనలో హీరో రామ్ చరణ్ ఘటనా స్థలంలోనే ఉన్నాడని పోలీసులు మానవ హక్కుల కమిషన్ కు నివేదిక ఇచ్చారు. చరణ్ సమక్షంలోనే గన్ మెన్లు ఉద్యోగులపై దాడి చేశారని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ ఉద్యోగులు ఫిర్యాదు చేయకపోవడంవల్లే కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. తన ఫోటోలు మార్ఫింగ్ చేశారని, తాను ఘటనా స్థలంలోనే లేనని చరణ్ గతంలో మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో ఇచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి.

  • Loading...

More Telugu News