: అఫ్జల్ భౌతికకాయం ఇచ్చేందుకు ప్రభుత్వం విముఖత


ఉగ్రవాది అఫ్జల్ గురు భౌతిక కాయాన్ని అతని కుటుంబానికి ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అఫ్జల్ భౌతిక కాయం కాశ్మీర్ చేరిందని..అయితే ఆ విషయం రహస్యంగా ఉందని జమ్మూ కాశ్మీరులో వదంతులు చెలరేగాయి. దీంతో ఈ వ్యవహారంపై ఊహాగానాలకు తెరదించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

అఫ్జల్ మృతదేహన్ని కుటుంబానికి అప్పగించేది లేదని అంటున్న కేంద్ర హోం శాఖ సీనియర్ అధికారి..ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని తెలిపారు. 
ఉరిశిక్ష అనంతరం అఫ్జల్ భౌతిక కాయానికి తీహార్ జైలులోనే అధికారులు అంత్యక్రియలు పూర్తి చేసిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News