: ప్లేట్లు కడిగి.. ఐఐటీలో సీటు కొట్టాడు


కటిక పేదరికం అతడి విద్యాకాంక్షను అపలేకపోయింది. కష్టాలు అతడి సంకల్పం ముందు చిన్నబోయాయి. కూలీ పనులతో ఐఐటీ కల నెరవేర్చుకున్న మంగళూరు వాసి మంజునాథ్ విజయగాథను ఒక్కసారి తెలుసుకోవాల్సిందే.

కర్ణాటక రాష్ట్రం, మంగళూరు పట్టణానికి చెందిన మంజునాథ్ కు ఇద్దరు తోబుట్టువులు. చిన్నప్పుడే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తల్లి కూలీ పనులతో కడుపునింపేది. బిడ్డలకు చదువు చెప్పించేంత స్థోమత ఆ తల్లికి లేదు. అయినా వచ్చిన పదో పరకలోంచి కొంత బిడ్డల చదువుకు వెచ్చించేది. ఇదే మంజునాథ్ ను కదిలించింది. దాంతో స్కూలుకెళ్లే రోజుల నుంచీ హోటల్లో కప్పులు కడిగి చదువుకోవడం మొదలెట్టాడు. క్యాటరర్ల దగ్గరా కూలీ పనులు చేశాడు. దాతలను ప్రాధేయపడ్డాడు. అందరి సహకారంతో ఐఐటీలో సీటు సంపాదించాడు. భువనేశ్వర్ లోని ఐఐటీలో ఆరేళ్ల ఎమ్మెస్సీ పీహెచ్ డీ కోర్సులో చేరి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి కన్నతల్లి కళ్లల్లో సంతోషం నింపాలనుకుంటున్నాడు మంజునాథ్. నిజంగా అతడి సంకల్పాన్ని మెచ్చుకోవాల్సిందే!

  • Loading...

More Telugu News