: వేదిక ఒక్కటే.. వరుడూ ఒక్కడే.. వధువులే ఇద్దరు!
వేద మంత్రాల సాక్షిగా ఒకే కల్యాణ వేదికపై ఇద్దరు వధువుల మెళ్లో తాళికట్టాడు రాజస్థాన్ కు చెందిన యువకుడు. ఉదయపూర్ జిల్లా చాతుర్ పూర్ కు చెందిన భగవతిలాల్(23) గిరిజనుడు. ఇతడు ఒక అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడు. అనుకోకుండా ఇటీవలే మరొకమ్మాయికి మనసిచ్చాడు. ఇద్దరికీ న్యాయం చేయాలనుకున్నాడు. ఇద్దరినీ పెళ్లాడతానని ప్రపోజ్ చేశాడు. అమ్మాయిలకు, వారి తల్లిదండ్రులకూ ఆఫర్ ఓకే అయింది. దాంతో పెళ్లి కూడా షురూ అయింది. కాకపోతే విషయం పోలీసుల చెవిన పడింది. తీరా రంగంలోకి దిగిన పోలీసులకు గిరిజన సంప్రదాయం ప్రకారం ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లాడవచ్చని తెలిసింది. దీంతో వారు ఆ విషయం వదిలేసి నూతన వధువుల వయసు వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు.