: ప్రభుత్వానికి ఆదర్శంగా టీడీపీ


ఉత్తరాఖండ్ లోని తెలుగు వారిని ఆదుకునే విషయంలో ప్రభుత్వానికి టీడీపీ ఆదర్శంగా ఉంది. ప్రకృతి బీభత్సానికి చలించిన టీడీపీ అధినేత ప్రభుత్వంపై విరుచుకుపడడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. ఢిల్లీలో ఆంధ్ర భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధర్నా చేయడంతో ఉలికిపడిన ప్రభుత్వం తక్షణం వైద్యులను కేటాయిస్తున్నట్టు చెప్పింది. అనంతరం బాధితులకు పదివేల చొప్పున బాబు కేటాయించడంతో, ప్రభుత్వం యాత్రీకుల ఖర్చుల నిమిత్తం 5 వేల రూపాయలు అందించేందుకు ముందుకు వచ్చింది. అనంతరం ఉత్తరాఖండ్ వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడి తెలుగువారు పడ్డ బాధలు చూసి, అక్కడ్నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం ఉత్తరాఖండ్ నుంచి తెలుగువారిని తరలించేందుకు విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

  • Loading...

More Telugu News