: ర్యాంకుల్లోనూ జడేజా హవా


చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రవీంద్ర జడేజా వన్డే ర్యాంకుల దుమ్మూ దులిపాడు. కొత్త ర్యాంకింగ్సులో బౌలర్ గా, ఆల్ రౌండర్ గా మూడో స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్ లో జడేజా 12 వికెట్లు తీసుకొని గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. రవిచంద్రన్ అశ్విన్ కూడా టాప్-10 లో తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఆరు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. బ్యాట్స్ మెన్ జాబితాలో విరాట్ కోహ్లి తన మూడో స్థానాన్ని నిలుపుకున్నాడు. శిఖర్ ధావన్ ఒకేసారి 21 స్థానాలు ఎగబాకి 29 స్థానానికి వచ్చేశాడు. కాగా బ్యాటింగులో సౌతాఫ్రికా కెప్టెన్ డెవిలియర్స్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News