: తాగొద్దన్నందుకు నిప్పంటించి చంపిన భర్త
మద్యం ఎంతటి వారినైనా చిత్తు చేస్తుంది. విచక్షణ చంపేస్తుంది. మన ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిన వేళ నెల్లూరు జిల్లాలో నేతలు ఆలోచించి అవలోకించాల్సిన ఘటన వెలుగు చూసింది. మునుబోలు మండలం జంట్ల కుదురులో వెంకటేశ్వర్లు మద్యానికి బానిసగా మారాడు. దీంతో ఆతనికి, అతని భార్య నాగమణికి మధ్య వాగ్వాదాలు జరుగుతుండేవి. తాజాగా సోమవారం తెల్లవారుఝామున మద్యం తాగి వచ్చిన వెంకటేశ్వర్లును నాగమణి నిలదీయడంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి పరారయ్యాడు. నాగమణి కేకలు విన్న కుటుంబసభ్యులు 108 వాహనంలో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. దీంతో గూడూరు సీఐ శ్రీనివాసులు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.