: తిరిగొచ్చిన టైగర్!
జూ నుంచి పారిపోయిన టైగర్ మళ్లీ అదే జూ కి తిరిగి వచ్చేయడమంటే గొప్ప విషయమే కదా. ఇప్పుడు అదే జరిగింది, భువనేశ్వర్లోని నందన్ కానన్ జంతుప్రదర్శనశాలలో. 18 అడుగుల ఎత్తున్న కంచెను దూకి ఓ మగ పులి మే 31న జూ నుంచి పారిపోయింది. తరువాత ఏమనుకుందో ఏమో.. ఎక్కడెక్కడో తిరిగి గత రాత్రే జంతుప్రదర్శనశాలకు వచ్చేసింది. 'నిన్న రాత్రే రాయల్ బెంగాల్ టైగర్ తిరిగి జంతు ప్రదర్శనశాలకు వచ్చేసినట్లు సీసీటీవీల ద్వారా తెలిసింది. ఇప్పుడా పులిని ప్రత్యేక బోనులో పెట్టాం' అని జంతుప్రదర్శనశాల అధికారి జేడీ శర్మ తెలిపారు.