: తెలుగువారిపై హీరో సిద్దార్థ్ సంచలన విమర్శలు
తెలుగు వారికి మంచి సినిమాలు చూడటం చేతకాదని, మాస్ మసాలా సినిమాలనే పదే పదే చూస్తారని హీరో సిద్దార్థ్ తెలుగువారిని విమర్శించాడు. పెద్ద హీరోల సినిమాలు, ప్రేమకథా చిత్రాలే తప్ప వైవిధ్యభరితమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించలేరని సిద్దార్థ్ అన్నాడు. తెలుగు దర్శకులకు సృజనాత్మక సినిమాలు తీసే సత్తా లేదని, ఇక్కడ మంచి దర్శకులే లేరని తేల్చి పారేశాడు.
కాసులు రాల్చే సినిమాలే తప్ప, కళాత్మక సినిమాలు తీయడం టాలీవుడ్ దర్శకుల వల్ల కాదన్నాడు. దక్షిణాది నటులను బాలీవుడ్లో చిన్నచూపు చూస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక్కడ జాతీయ అవార్డ్ తీసుకున్న హీరోలనైనా బాలీవుడ్‌లో కొత్త ముఖాలుగానే చూస్తారని చెప్పుకొచ్చాడు. వైవిధ్యభరిత సినిమాలను ఆదరించడంలో తమిళులు ఎప్పుడూ ముందుంటారన్నాడు. అలాగే సంథింగ్.. సంథింగ్ సినిమాలో హీరోయిన్ హన్సిక కంటే అతిధి పాత్రలో నటించిన సమంతానే బాగా చేసిందనేశాడు.