: ధావన్ అదొక్కటే తెలుసుకోవాలి: లక్ష్మణ్
తన వికెట్ విలువేమిటో శిఖర్ ధావన్ తెలుసుకుంటే చాలని భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. 'చాలా ఏళ్లుగా శిఖర్ ధావన్ గురించి నాకు తెలుసు. నైపుణ్యం, ప్రతిభ కలగలసిన ఆటగాడు. ఢిల్లీ, నార్త్ జోన్, సన్ రైజర్స్ జట్లకు ఎనలేని మేలు చేశాడు. టీమిండియాకు ఇప్పుడు కీలకమయ్యాడు. అన్నివిధాలుగా తిరుగులేని విధంగా ఉన్న ధావన్ తన వికెట్ విలువేంటో తెలుసుకుంటే చాలు' అని వివరించాడు లక్ష్మణ్.