: గల్ఫ్ భారతీయులకు శుభవార్త


గల్ఫ్ లో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను తరిమేసేందుకు వచ్చిన నితాఖత్ చట్టం వల్ల ఉపాధి కోల్పోయిన భారతీయులకు రియాద్ లోని భారత దౌత్య కార్యాలయం సహకారం అందిస్తోంది. ఇందుకోసం రియాద్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నెల 22నుంచి 26 వరకు జాబ్ స్టేటస్ కరెక్షన్ ఫెయిర్ పేరుతో నిర్వహించనున్న ఉద్యోగమేళాలో భారత్ పాలుపంచుకోనుంది. ఉద్యోగం కోల్పోయిన భారతీయులకు మరో అవకాశాన్ని కల్పించడమే ధ్యేయంగా స్టాల్ ను నిర్వహిస్తున్నామని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో 20 లక్షల మందికి పైగా భారతీయులు పలు ఉద్యోగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు గత రెండు నెలలుగా 200 కంపెనీలు తమను సంప్రదించాయని భారత ఎంబసీ తెలిపింది. దీంతో చాలామంది భారతీయులు ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారని తెలిపింది.

  • Loading...

More Telugu News