: రాజమండ్రితో బంధం తెగిపోదు: మురళీమోహన్
రాజమండ్రితో తన బంధం తెగిపోదని సినీనటుడు, తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నియోజకవర్గం ఇన్ చార్జి మాగంటి మురళీమోహన్ తెలిపారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ రాజమండ్రి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం రాజమండ్రిలో తన 74వ పుట్టినరోజు వేడుకలు జరిగిన సందర్భంగా ఆయన మాట్లాడారు.