: బాబుపై దానం ఫైర్


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మాట్లాడిన నాగేందర్ అమెరికా నుంచొచ్చిన బాబు ఉత్తారఖండ్ బాధితులను ఆదుకోవాల్సింది పోయి నాటకాలాడుతున్నారన్నారు. చార్ ధామ్ యాత్రీకుల రక్షణకు ఉత్తరాఖండ్ తరువాత వెంటనే స్పందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని, ఉత్తరాఖండ్ కు 25 బస్సులను ముందుగా ఏర్పాటు చేసింది మనమేనని తెలిపారు. ఇప్పటికే అక్కడ మంత్రులు పర్యటించి వచ్చారని, అంతా అయిపోయాక తీరిగ్గా స్పందిస్తున్న బాబు ఇప్పడు నీతులు చెబుతున్నారని మండిపడ్డ ఆయన, డ్రామాలు మాని నిజాయతీగా సేవ చేయాలని బాబుకు సూచించారు. ఏది రాజకీయం చేయాలో, ఏది చేయాకూడదో బాబు గుర్తించాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News