: 'కష్టించేవారు భారతీయులే'
పేదరికం పోవాలంటే అది విద్యతోనే సాధ్యమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విశాఖజిల్లా అనకాపల్లిలో సోమవారం ముఖ్యమంత్రి ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. భారతీయ యువకులు కష్టపడి పనిచేస్తారనే గుర్తింపు విదేశాల్లో ఉందని అన్నారు. దానిని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్లలో బీసీలకు కేవలం 1580 కోట్ల రూపాయలు విడుదల చేస్తే, తమ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 4027 కోట్లు విడుదల చేసిందన్నారు.