: ఎట్టకేలకు యువరాజు ఉత్తరాఖండ్ పర్యటన
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఎట్టకేలకు స్పందించారు. పలు పార్టీలకు చెందిన నేతలంతా ఉత్తారఖండ్ ఘటన పట్ల వెంటనే స్పందించి, తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే, భారత భావిప్రధాని రేసులో ఉన్నా వెంటనే స్పందించకపోవటంతో రాహుల్ పై విమర్శల వాన కురిసింది. దీంతో ఎట్టకేలకు రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ పర్యటనకు ఉపక్రమించారు. దీంతో నేడు ఉత్తరాఖండ్ వరదబాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటనకు వెళ్ళారు.