: ఎన్టీఆర్ ట్రస్టు వైద్యులకు అనుమతి నిరాకరణ
ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన ఉత్తరాఖండ్ యాత్రికులకు వైద్యసాయం అందించేందుకు వెళ్లిన ఎన్టీఆర్ ట్రస్టు వైద్యులకు ఊహించని విధంగా చుక్కెదురయింది. ఉత్తరాఖండ్ బాధితులకు ప్రభుత్వ వైద్య సాయం అందుతోందని, మరే వైద్యుల అవసరం లేదని రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ వ్యాఖ్యానించారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.