: జడేజా స్థానం అదే: ధోని
రవీంద్ర జడేజా ఏడో స్థానంలో దిగడమే జట్టుకు లాభమని భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆల్ రౌండర్ గా అద్భుతంగా రాణిస్తున్న జడేజా నిన్న ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 'నిజానికి ఏడో స్థానంలో కచ్చితంగా ఇలాంటి ఆల్ రౌండర్ ప్రతి జట్టుకు ఉండాల్సిందే. ఈ సిరీస్ లో జడేజానే చాలావరకు ఆదుకున్నాడు. ఇక శిఖర్ దావన్ అన్ని మ్యాచులను తనవిగా చేసుకున్నాడు' అంటూ సహచరులపై ధోని ప్రశంసల జల్లు కురిపించాడు.