: మనోకు తప్పిన పెనుప్రమాదం


గాయకుడు మనో తోపాటు చాలామందికి పెను ప్రమాదం తప్పింది. మలేషియా నుంచి చెన్నై వచ్చేందుకు ఆయన ఎక్కిన విమానం ఇంజన్ ఫెయిలయింది. 'కౌలాలంపూర్ లో నేను ఎక్కిన విమానం రన్ వే నుంచి ఆకాశమార్గంలోకి వెళ్లిన కొద్దిసేపటికే ఊగడం మొదలుపెట్టింది. మేమంతా బాగా భయానికి గురయ్యాం. ఈలోగా ఫైలెట్ వచ్చి.. చిన్న రిపేర్ వచ్చింది. సమస్యేమీ లేదు. మనమిప్పుడు కౌలాలంపూర్ తిరిగి వెళ్తున్నాం అని చెప్పాడు. ఏ ప్రమాదం జరగకుండా తిరిగి కౌలాలంపూర్లో దిగిన తరువాత ఇంజన్ ఫెయిల్ అయిందనే విషయం తెలిసింది. ప్రారంభంలోనే జరగడం మంచిదయింది. అదే ఏ నడి మధ్యలో అయితే.. ఊహించడానికే భయమేస్తోంది' అంటూ సురక్షితంగా మరో విమానంలో చెన్నై వచ్చిన మనో వివరించారు.

  • Loading...

More Telugu News