: స్ఫూర్తి నింపిన ధోని మాటలు
ఇంగ్లండ్ తో నిన్న జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తక్కువ స్కోరు మ్యాచును కాపాడుకోవడానికి టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన సహచరులకు ఎలా స్ఫూర్తి నింపాడో తెలుసా! తెలియకపోతే ఆయన మాటల్లోనే వినండి. 'మనల్ని మనం కాపాడుకుంటేనే దేవుడు తనవంతు సాయం చేస్తాడు. ఇది టి 20నా? 50 ఓవర్ల మ్యాచా? అని ఆలోచించకండి. వన్డేల్లో మనం నెంబర్ వన్ గా నిలిచాం. ప్రపంచ చాంపియన్లం. ఆ విషయాన్నే నిరూపించండి. ఆకాశంవైపు చూడొద్దు. అవకాశాలను మనమే కల్పించుకోవాలి. చాంపియన్స్ ట్రోఫీ మనమే దక్కించుకోవాలి' అంటూ ఫీల్డింగ్ కు వెళ్లేముందు తన సహచరులతో చెప్పానని ధోనీ మ్యాచ్ అనంతరం తెలిపాడు. ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లు సహా, ఇంగ్లండ్ ను వాళ్ల గడ్డ మీదే ఓడించి చాంపియన్లగా నిలవడం కంటే గొప్పవిషయం మరోటి ఉండదని ధోనీ అన్నాడు.