: భయపెడుతున్న ఉత్తరాఖండ్ మృతుల సంఖ్య
ఓ పది మంది వరకూ చనిపోయి ఉండవచ్చన్నది తొలి మాటలు. అది మెల్లగా పదుల సంఖ్యకు చేరింది. తరువాత వందల సంఖ్యకు.. లేదు.. లేదు.. వెయ్యి మంది మరణించారన్నారు. మరిప్పుడో ఆ సంఖ్య 5 వేలకు దాటిందంటున్నారు. ఏమిటి ఘోరం? ఇంతేనా, తట్టుకోలేని సంఖ్యలను ఇంకా వినాల్సివస్తుందా! ఉత్తరాఖండ్ వరదల్లో రోజురోజుకూ తెలుస్తున్న నిజాలు దేశవ్యాప్తంగా భయాన్ని రేపుతున్నాయి. ఐదువేలమందికి పైగా చనిపోయుంటారని ఉత్తరాఖండ్ ప్రభుత్వమే అనగలిగిందంటే.. వాస్తవంగా చనిపోయినవారు ఎంతమంది? దాదాపు 20 వేల మంది వరకు యాత్రికులు ఇంకా కొండకోనల్లోనే ఉన్నారని చెబుతున్నారు. సహాయక చర్యలకు వర్షం ఇకనైనా ఆటంకం కలిగించకపోతే కొనఊపిరితో ఉన్న యాత్రికులను చాలామందిని రక్షించవచ్చు.