: ప్రధాని కుమార్తె మానవత్వ పరిమళాలు
మానవ హక్కుల పరిరక్షణకు పాటు పడుతున్న ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తె అమృత్ సింగ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది. ఇండియా అబ్రాడ్ అనే సంస్థ స్పెషల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ 2012 అవార్డును అమృత్ సింగ్ కు ప్రకటించింది. అనుమానిత ఉగ్రవాదులపై అమెరికా సీఐఏ వేధింపులను ప్రస్తావిస్తూ అమృత రాసిన వ్యాసానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించింది. అమృత న్యూయార్క్ లో ఒక సంస్థలో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. తాము పనిచేస్తున్న రంగాలలో విశేష కృషి చేసిన భారత అమెరికన్లకు ఇండియా అబ్రాడ్ ఏటా అవార్డులను అందిస్తుంటుంది.