: విషమించిన మండేలా ఆరోగ్యం


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు అధికార ప్రతినిధి మాక్ మహారాజ్ ఆదివారం రాత్రి ప్రకటించారు. గత 24 గంటల్లో పరిస్థితి క్షీణించిందని తెలిపారు. వైద్యులు చేయాల్సినదంతా చేస్తున్నారని చెప్పారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా, ఉపాధ్యక్షుడు రామ్ ఫోసా చికిత్స పొందుతున్న మండేలాను పరామర్శించారు. తీవ్ర ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో మండేలా ఈ నెల 8న ఆస్పత్రిలో చేరారు.

  • Loading...

More Telugu News