: ఆకాశంలోంచి హైదరాబాద్ నగర పహారా


ఇక హైదరాబాద్ నగర భద్రత మరింత పటిష్ఠం కానుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కమెండోలు గగనతలం నుంచి కూడా పహారా కాయనున్నారు. ఇలా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్ కతా, అహ్మదాబాద్, ఢిల్లీ మొత్తం ఏడు నగరాలపై గగనతల నిఘా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. హెలికాప్టర్లలో సాయుధ కమెండోల పహారాతోపాటు, మానవరహిత నిఘా విమానాలు కూడా ఆకాశంలోంచి నగరమంతటినీ పర్యవేక్షిస్తాయి. వీటిలో అత్యాధునిక కెమెరాలు ఉంటాయి. ఇవి చిత్రాలను తీసి భూమిపై ఉన్న కంట్రోల్ రూంకి పంపిస్తాయి. దాంతో తీవ్రవాదులు, ఇతర సంఘ విద్రోహ శక్తుల జాడను తేలిగ్గా గుర్తించడానికి వీలవుతుంది. తద్వారా ముందస్తు చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని కేంద్ర హోంశాఖ యోచన. కేంద్ర హోంశాఖ సురక్షిత నగరం అనే ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. అలాగే అన్ని నగరాలలోనూ పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని హోంశాఖ తన మార్గదర్శకాలలో పేర్కొంది.

  • Loading...

More Telugu News