: అధిక బరువుంటే రోగాలు కూడా ఎక్కువే
బరువు ఎక్కువగా ఉండే వారికి అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. అధికబరువు ఉండే వ్యక్తులు మిగిలిన వారితో పోల్చుకుంటే ఎక్కువగా రోగాల బారిన పడతారని లయోలా సెంటర్ ఫర్ మెటబాలిజవమ్ సర్జరీ అండ్ బరియాట్రిక్ కేర్ కి చెందిన జెస్సికా బార్ట్‌ఫీల్డ్ చెబుతున్నారు.
ఒక వ్యక్తి జీవన విధానం, ఆహారం ఆ వ్యక్తి బరువుపై ప్రభావం చూపుతుందని, ఇంకా అధిక బరువు ఉండే వ్యక్తులకు సంబంధించిన అనువంశికత, పరిసరాలు, హార్మోన్ల అసమతౌల్యం, నిద్రకు సంబంధించి అలవాట్లు ఇవన్నీ కూడా బరువు పెరిగే విషయంలో ప్రభావం చూపుతాయని ఆమె చెబుతున్నారు. అధిక బరువు పెరగడం వల్ల టైప్2 మధుమేహం, హైపర్‌టెన్షన్, గుండెకు సంబంధించిన సమస్యలు, ఎముకలకు సంబంధించిన ఆస్టియోపోరోసిస్, నిద్రలో గురకపెట్టడం వంటి పలు సమస్యలు వస్తాయని ఆమె చెబుతున్నారు.