: గ్రీన్‌ కాఫీతో బరువు తగ్గొచ్చుట


మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా... అయితే మీకు గ్రీన్‌కాఫీ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ శరీరంలోని కొవ్వును కరిగించడంలో గ్రీన్‌కాఫీ బాగా ఉపయోగపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. పలు అధ్యయనాల్లో గ్రీన్‌ కాఫీ బ్లడ్‌ ప్లెషర్‌ను తగ్గించడంతోబాటు జీవనక్రియలను మెరుగుపరుస్తుందని తేలింది.

గ్రీన్‌కాఫీ గింజల్లోని క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ప్రకృతి సిద్ధమైనది. ఇది శరీరంలోని గ్లూకోజ్‌ విడుదలను నియంత్రించడం, జీవక్రియలను మెరుగుపరచడంతోబాటు కాలేయంలో కొవ్వును కరిగించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. గ్రీన్‌కాఫీ గింజలు చాలా చేదుగా ఉండడం వల్ల వీటిని కాప్యూల్స్‌ రూపంలో తీసుకుంటే బాగుంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు. గ్రీన్‌కాఫీ గింజలు షుగరును తగ్గిస్తాయని, అలాగే జీవనక్రియలను మెరుగుపరుస్తాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలింది.

  • Loading...

More Telugu News