: మరో 100 మంది వైద్యులను పంపుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్నవారి కోసం మరో 100 మంది వైద్యులను పంపించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయించింది. ఇప్పటికే ఈ ట్రస్ట్ నుంచి 20 మంది వైద్యులు ఉత్తరాఖండ్ బయలుదేరారు. వారు తమతోపాటు 15 లక్షల రూపాయల విలువైన మందులను తీసుకెళ్లారు. వీరితోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలనుంచి మరికొంతమంది వైద్యులను ఉత్తరాఖండ్ పంపిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ వెల్లడించింది.