: రాజమౌళితో చేస్తా: బాలీవుడ్ నటుడు రణ్వీర్
బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే స్టార్ అవుతున్న రణ్వీర్ సింగ్ కు రాజమౌళి దర్శకత్వంలో నటించాలనుందట. బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాదిలో నటించాలనుందని రణ్వీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'దక్షిణాదిలో రాజమౌళి, మణిరత్నం, శంకర్ దర్శకత్వం అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ల దర్శకత్వంలో నటించాలనుంది. నటిస్తాను కూడా. భాష అడ్డంకే అయినప్పటికీ నేర్చుకొని, నా కోరిక నెరవేర్చుకుంటాను' అంటున్నాడు రణ్వీర్