: మేమూ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నాం : ఢిల్లీ మహిళా కౌన్సిలర్లు
తాము కూడా లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నామంటూ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మహిళా కౌన్సిలర్లు నోరు విప్పారు. మునిసిపల్ సమావేశాలు, కార్యక్రమాలలో పురుష కౌన్సిలర్ల నిందలు, లైంగిక వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయని ఆరోపించారు.
ఈ మేరకు మాజీ మేయర్ రజనీ అబ్బి మహిళా కౌన్సిలర్లు ఎదుర్కొంటున్న పరిస్థితిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. తమ ముందే పురుష కౌన్సిలర్లు అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఈ రోజు జరిగిన మునిసిపల్ కార్పొరేషన్ సమావేశం కూడా ఇదే విషయంపై మహిళా కౌన్సిలర్ల నిరసనలతో అట్టుడికిపోయింది.