: కేసీఆర్ కు అంతా తెలుసు: రేవంత్ రెడ్డి
చట్ట వ్యతిరేకంగా కేటీఆర్ చేస్తున్న పనులన్నీ కేసీఆర్ కు తెలుసునని తెదేపా అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రత్యేక రాష్ట్రవాదానికి తెలంగాణ ప్రజలు ఉద్యమ రూపమిస్తే.. దానిని తెరాస వ్యాపారంగా మార్చేసిందని ఆయన విమర్శించారు. తులసివనంలో తెరాస గంజాయి మొక్క అని అన్నారు. కేటీఆర్ కార్యకలాపాలు ఉద్యమానికి గొడ్డలిపెట్టు అని తెలిసినా కేసీఆర్ నోరు మెదపడం లేదని రేవంత్ అన్నారు.