: వాయు కాలుష్యంతో గుండెనొప్పి!


కాలుష్యం.. నేటి నగరజీవి దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ కాలుష్యం నుంచి ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. వాయు కాలుష్యం వల్ల గుండెనొప్పి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఓ పరిశోధనా బృందం తేల్చింది.

అమెరికాలో కేవలం వాయు కాలుష్యం వల్ల ఎనిమిదేళ్ల కాలంలో 11వేల మంది చనిపోయినట్లు ఆ దేశంలోని రైస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్థారించారు.  దీనికి ప్రధాన కారణం.. వారున్న చోట స్వచ్ఛమైన గాలి లేకపోవడమేనని పరిశోధకులు చెబుతున్నారు. భూవాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ ల స్థాయులు పెరగడం వల్ల  వాయుకాలుష్యం ఏర్పడుతుంది. వీటి వల్ల వాతావరణంలో ఓజోన్ పరిణామం క్రమక్రమంగా తగ్గిపోతోంది. 

వాయు కాలుష్యం ప్రభావం భారతదేశంపై కూడా ఎక్కువగానే ఉందని 'లాన్ సెట్'  పత్రిక తెలిపింది. వాయు కాలుష్యంతో గుండెనొప్పి బారిన పడుతోంది నగరాల్లో నివసించే వారేనని పరిశోధనలు తేలుస్తున్నాయి.  కాబట్టి, ఓ నగరజీవీ.. స్వచ్ఛమైన గాలి కూడా నీకు కరవయ్యింది! పారా హుషార్! అంటున్నారు శాస్త్రవేత్తలు.

  • Loading...

More Telugu News