: విశాఖలో రాంచరణ్ కు ఘన స్వాగతం


కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, పవర్ స్టార్ రాంచరణ్ కు విశాఖలో అభిమానుల నుంచే కాకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. విశాఖ నగరంలో ఈ ఉదయం ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. దీనిని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆశీనులయ్యారు. ఇదే రన్ కు రాంచరణ్ కూడా అతిథిగా వచ్చారు. వేదికపైకి వచ్చిన చరణ్ కు ముఖ్యమంత్రి, మంత్రులు షేక్ హ్యాండ్ తో స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News