: మజ్లిస్ పై దేశద్రోహం కేసు ఏమైంది: వెంకయ్య
రానున్న ఎన్నికల్లో రాష్టంలో బీజేపీ జయభేరి మోగిస్తుందని ఆ పార్టీ నేత వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు రాజకీయ పునరేకీకరణలు ఉంటాయన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 61వ వర్థంతి సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీజేపీ యువమోర్చా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. అందులో పాల్గొన్న వెంకయ్య మీడియాతో మాట్లాడారు. యువత శ్యామ్ ప్రసాద్ ఆశయాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ముస్లింలీగ్, మజ్లిస్ పార్టీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ లౌకికవాదం గురించి మాట్లాడడం సిగ్గు చేటన్నారు. మజ్లిస్ పై నమోదైన దేశద్రోహం కేసు ఏమైందని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే దాని సంగతి తేలుస్తామన్నారు.