: నాగలి పట్టకుండానే చిరంజీవి తిరుగుముఖం
దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో రెండో హరిత విప్లవం వస్తుందని చిరంజీవి చెప్పారు. గంటూరు జిల్లా తాటికొండకు వచ్చిన చిరంజీవి నాగలితో భూమి దున్ని ఏరువాక చేయాల్సి ఉంది. కానీ, చిరంజీవిని చూసేందుకు స్థానికులు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో ఆ ముచ్చట తీరకుండానే ఆయన తిరుగుముఖం పట్టారు. ఈ సందర్భంగా మీడియాతో చిరంజీవి మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు.