: మీసేవా కేంద్రాల్లోనూ ఆధార్ నమోదు: మంత్రి పొన్నాల


గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఆధార్ కార్డులతో లంకె పెట్టడంతో ఆధార్ నమోదు కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ఆధార్ నమోదు కేంద్రాలతో పాటు, మీసేవా కేంద్రాల్లోనూ ఆధార్ సేవలు పొందవచ్చని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఇకనుంచి మీ సేవా కేంద్రాల్లో నూతన ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికీ కార్డులు అందుకోనివారు, కార్డులు పోగొట్టుకున్న వారు ఈ కేంద్రాల్లో తమ నెంబరును పొందవచ్చని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 6000 మీసేవా కేంద్రాల్లోనూ ఆధార్ సేవలు లభ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. పొన్నాల ఈ రోజు ఖైరతాబాద్ ఆర్టీఏ ఆవరణలో గల మీసేవా కేంద్రంలో ఆధార్ సేవలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న 3329 ఆధార్ నమోదు కేంద్రాలతో పాటు ఫిబ్రవరి ఆఖరుకల్లా కొత్తగా మరో 2893 కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News