: సన్నీలియోన్ సినిమాలో ఆమె భర్త
బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ ఇప్పుడు నటిస్తున్న సినిమా 'రాగిణి ఎమ్ఎమ్ఎస్-2'. తరువాత కైజాద్ గుస్తాద్ దర్శకత్వంలో మరో సినిమాలో సన్నీ నటించనుంది. విశేషం ఏమిటంటే, ఈ సినిమాలో ఆమె భర్త డేనియల్ వెబర్ కూడా నటిస్తున్నాడట. సన్నీ గతంలో నీలిచిత్రాల్లో నటిస్తున్నప్పుడు ఆమె ఎక్కువగా వెబర్ తోనే జతకట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలసి బాలీవుడ్లో ఒకే సినిమాలో నటిస్తుండడం అందర్నీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాలో వెబర్ ఆమెకు జోడీగా నటించకపోవడం మరో విశేషం.