: తుపాకులతో బెదిరించి 6 లక్షలు లూటీ
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో దోపిడీ దొంగలు పట్టపగలే లూటీకి పాల్పడ్డారు. వాహనాలలో వచ్చిన దుండగులు ఈ ఉదయం ఒక రైసు మిల్లులోకి ప్రవేశించి అక్కడున్న వారిని తుపాకులతో బెదిరించారు. అనంతరం 6లక్షల రూపాయల నగదు దోచుకుని పరారయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగి గాలింపు జరుపుతున్నారు.