: స్పష్టమైన సమాచారం లేదు: చిరంజీవి
ఉత్తరాఖండ్ వరదల్లో ఎంతమంది చిక్కుకున్నారనే విషయంపై స్పష్టత లేదని కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. కేదార్ నాథ్ లో గల్లంతైన బావాజీపేట బాధిత కుటుంబ సభ్యులను కేంద్రమంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు వట్టి వసంత్ కుమార్ పలువురు ఎమ్మెల్యేలు పరామర్శించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'కొండల్లోనూ, అడవుల్లోనూ యాత్ర జరగడంతో ఎవరు ఎక్కడ చిక్కుకుపోయారనే విషయంపై అధికారులు ఓ స్పష్టతకు రాలేకపోతున్నారు' అని చెప్పారు.