: పాక్ లో 10 మంది విదేశీయుల కాల్చివేత
పాకిస్థాన్ లో మరోసారి విదేశీయులు ఉగ్రదాడికి బలయ్యారు. ఉత్తర పాక్ లోని గిల్గిట్-బాల్టిస్తాన్ పట్టణంలో విదేశీయులు బస చేసిన హోటల్లోకి ఈ ఉదయం తుపాకులతో ప్రవేశించిన ఉగ్రవాద మూక ఇష్టారీతిగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో 10 మంది మరణించారని పోలీసులు తెలిపారు. మృతులలో చైనా, ఉక్రెయిన్, రష్యా పౌరులు ఉన్నట్లు సమాచారం.