: వచ్చే 24 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయువ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు వరకూ ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాలలో, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.