: భద్రాచలం ఆలయంలో చోరీ
ప్రముఖ పుణ్యక్షేత్రం, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న గోవిందరాజస్వామి ఆలయంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి దొంగలు ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారికి చెందిన సుమారు 2 కేజీల వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. ఆలయ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనంతో ఆలయ పరిసరాల్లో భద్రతపై సందేహాలు నెలకొన్నాయి.