: కేదార్ నాథ్ లో మళ్లీ కుండపోత వర్షం


వారం క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల నుంచి ఇంకా తేరుకోకముందే కేదార్ నాథ్ పై మరోసారి వరుణుడు విరుచుకుపడ్డాడు. ఇంకా వేలాది మంది కేదార్ నాథ్, పరిసర ప్రాంతాలలో, కొండల్లో ప్రాణ రక్షణ కోసం పరితపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సహాయక చర్యలు ముమ్మరమవుతుండగా.. ఈ ఉదయం నుంచి మళ్లీ కేదార్ నాథ్, రుద్రప్రయాగ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో మరోసారి జలప్రళయం తప్పకపోవచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

వర్షాల కారణంగా మళ్లీ కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో సోన్ ప్రయాగ్ లో హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలను నిలిపివేశారు. వర్షం పడుతుండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయితే, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు మాత్రం వర్షంలోనూ తమ సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. నేటి నుంచి 26వరకు సాధారణం నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News