: కాలిఫ్లవర్‌తో క్యాన్సర్‌కు చెక్ పెట్టచ్చు
కాలిప్లవర్ క్యాన్సర్‌ని దూరంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలిఫ్లవర్‌లో ఉండే రసాయనాలు మనల్ని క్యాన్సర్ బారినుండి దూరంగా ఉంచడమే కాకుండా మన కాలేయం పనితీరును కూడా క్రమబద్ధం చేస్తాయట.
కాలిఫ్లవర్‌ని తీసుకోవడం వల్ల లంగ్, బ్రెస్ట్, ఒవేరియన్, ఇంకా బ్లాడర్ క్యాన్సర్ వంటి పలు క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫ్లవర్‌లో ఉండే గ్లూకోసినోలేట్స్, ధయోసయనేట్స్ లివర్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకా ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది రుమటాయిడ్ ఆర్ధరైటిస్ నుండి రక్షణనిస్తుందని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. మన రోజువారీ ఆహారంలో కాలిఫ్లవర్ చేర్చుకుంటే ఇన్ని ప్రయోజనాలున్నాయన్నమాట.