: గుడ్‌ క్యాచ్‌...!


క్యాచ్‌ పట్టడం అంటే అలా ఇలా కాదు... ఎంచక్కా కింద పడకుండా పట్టుకోవడం. ఏంటీ, ఇదేదో క్రికెట్‌ బాల్‌ పట్టుకోవడం గురించి అనుకుంటున్నారా... కాదు. ఓ పిల్లాడిని కిందపడకుండా పట్టుకోవడం గురించి. రెండు అంతస్థుల ఎత్తునుండి కిందపడుతున్న చిన్న బాబుని చక్కగా చేతుల్లోకి పట్టుకుంది ఓ మగువ.

న్యూయార్క్ నగరంలో ఏడాది వయసున్న డైలాన్‌ మిల్లర్‌ అనే బుడతడు భవనంలోని రెండో అంతస్తులో ఆడుకుంటూ రక్షణ కోసం పెట్టిన అట్టను కిందికి తోసేసి కిటికీలోకి వచ్చేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన క్రిస్టీనా అనే మహిళకు ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. వెంటనే అత్యవసర సిబ్బందికి ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించింది. అంతలోనే కిటికీలోంచి బాబు కిందికి పడిపోవడం చూసింది. ఇక వెంటనే మెరుపు వేగంతో ముందకు దూకి కిందికి పడుతున్న డైలాన్‌ను తన చేతుల్లోకి పట్టేసుకుంది. దీంతో ఆ బాలుడికి పునర్జన్మ ప్రసాదించినట్టయింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే... ఇంత చక్కటి క్యాచ్‌ పట్టిన క్రిస్టీనా తండ్రి ప్రముఖ బేస్‌బాల్‌ ప్లేయర్‌ జో టోరీ. అందుకేనేమో... క్రిస్టీనా అంత చక్కగా బిడ్డను క్యాచ్‌ పట్టుకుంది!

  • Loading...

More Telugu News