: ఈరోజు సూపర్‌'మూన్‌' వస్తాడు


ఈ ఏడాదికే పెద్ద రూపంలో చంద్రుడు ఈరోజు ప్రకాశించనున్నాడు. చంద్రుడు ఈరోజు సూపర్‌ మూన్‌ దశకు చేరుకోనుండటంతో ఆదివారం నాడు రాత్రి చందమామ అతి పెద్ద రూపంతో, అత్యంత ప్రకాశవంతంగా మనకు కనిపించనున్నాడు.

చంద్రుడు భూమిచుట్టూ తిరిగే మార్గంలో భూమికి అతి సమీప బిందువైన పెరీజీ వద్దకు నేడు చేరుకోనున్నాడు. ఈ సమయంలో చంద్రుడు మనకు ఇప్పటి వరకూ కనిపించే రూపంకన్నా పెద్ద రూపంతో కనిపిస్తాడు. అలాగే దూరపు బిందువైన అపోజీ వద్దకు చేరుకున్న సమయంలో సాధారణంగా మనకు కనిపించే రూపంకన్నా చిన్నగా కనిపిస్తాడు. ఇప్పుడు అపోజీ వద్ద కనిపించే చంద్రుడికన్నా పెద్దగా కనిపించనున్నాడు. ఈరోజు కనిపించే చంద్రుడిని సూపర్‌మూన్‌గా పిలుస్తారు. ఈరోజు కనిపించబోయే చంద్రుడు జనవరి 16, 2014లో కనిపించబోయే చంద్రుడికన్నా కూడా 12.2 శాతం పెద్దగాను, ముఫ్ఫై శాతం ఎక్కువ ప్రకాశవంతంగాను కనిపించనున్నాడట. ఈరోజు తర్వాత మళ్లీ వచ్చే ఏడాది ఆగస్టులో మళ్లీ ఇలా పెద్ద చంద్రుడు మనకు కనిపించనున్నాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News