: కావూరి గొప్ప ప్రయత్నం
కేంద్ర జౌళి శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కావూరి సాంబశివరావు తొలిప్రయత్నమే గొప్పగా చేశారు. ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకోవలసిందిగా ఆయన చేసిన విజ్ఞప్తితో, రూ.2.6కోట్లు విరాళాలు అందించేందుకు జౌళి సంబంధిత వ్యాపార సంస్థలు సంసిద్దత వ్యక్తం చేశాయి. తమ శాఖ తరుపున బాధితులకు వస్త్రాలు, వసతి కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా కావూరి తెలిపారు.