: టీమిండియా సూపర్: మైఖేల్ వాన్
2011లో ప్రపంచకప్ గెలిచిన జట్టు కంటే ప్రస్తుత టీమిండియా జట్టే అత్యుత్తమమైనదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. 'నేను చూసిన భారత జట్టులో ఇదే అత్యుత్తమం. కుర్రాళ్లు దేనికీ భయపడడం లేదు. సునాయాసంగా ఆడుకుంటున్నారు. సాహసోపేతంగా ఆడుతున్నారు. 2011 ప్రపంచకప్ గెలిచిన జట్టుకంటే ఈ జట్టే ఉత్తమమైనదని నా అభిప్రాయం' అన్నాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ తో రేపు ఫైనల్లో తలపడనున్న భారతజట్టుకు వాన్ వ్యాఖ్యలు మరింత బలాన్నిస్తాయనడంలో సందేహం లేదు.