: తెలుగువారికోసం ప్రత్యేక హెలికాప్టర్
ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారి కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్ పంపనుందని మంత్రి దానం నాగేందర్ వెల్లడించారు. డెహ్రడూన్ వెళ్లిన నాగేందర్, కేంద్రమంత్రి బలరాం నాయక్, శ్రీధర్ బాబు అక్కడ తెలుగువారిని కలుసుకున్నారు. త్వరలో హెలికాప్టర్ వస్తుందని బాధితులతో నాగేందర్ చెప్పారు.