: ప్రైవేటు పాఠశాలలతో అనర్థమే: సీఎం
ప్రైవేటు పాఠశాలలతో అనర్థమేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. చదువును ప్రైవేటు పాఠశాలలు వ్యాపారం చేసేశాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వాటికంటే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. బాలబాలికలు మంచి పౌరులుగా ఎదగడానికి ఉపాధ్యాయుడే కీలకమని సీఎం అన్నారు.