: అగస్టా కుంభకోణంపై పార్లమెంటులో చర్చకు సిద్ధం: ప్రధాని
అగస్టా హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ పెదవి విప్పారు. ఈ కుంభకోణంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమని ఆయన ప్రకటించారు. ఇప్పటికే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ కుంభకోణంతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, తద్వారా సభను స్తంభింప చేయాలన్న విపక్షాల ఆలోచనకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశ్యం ప్రధాని మాటల్లో స్పష్టమవుతోంది. ప్రధాని ప్రకటనతో విపక్షాలు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.