: 2 హెలీకాప్టర్లు, 30 బస్సులను పంపిన గుజరాత్, రాజస్థాన్
ఉత్తరాఖండ్ వరదబాధితులను ఆదుకునేందుకు అందరూ నడుంబిగించారు. ఆర్మీ, వైమానిక, బోర్డర్ ఫోర్స్, ఇండోటిబెటన్ బోర్డర్ ఫోర్సు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరో రెండు రోజుల్లో వరదలు మళ్లీ ముంచుకొచ్చే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలతో వీరంతా అప్రమత్తమయ్యారు. కాగా వీరికి సహాయంగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు రెండు హెలీకాప్టర్లు, 30 బస్సులను కేటాయించాయి.దీంతో సహాయకార్యక్రమాలు మరింత పుంజుకోనున్నాయి.